
ఇప్పుడు ఆ జాబితాలో నితిన్ కూడా యాడ్ అయ్యారనే సంగతి తెలిసిందే. కథల విషయంలో మారని పక్షంలో ఈ ఇద్దరు హీరోలు భవిష్యత్తులో సైతం కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొనే ఛాన్స్ అయితే ఉంది. రామ్, నితిన్ కథల విషయంలో మారతారో లేదో చూడాల్సి ఉంది. ఈ ఇద్దరు హీరోల పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉన్నాయని సమాచారం అందుతోంది.
రామ్, నితిన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు అయినా ఈ హీరోలకు భారీ స్థాయిలో సక్సెస్ ను అందిస్తాయేమో చూడాల్సి ఉంది. రామ్ , నితిన్ లకు సోషల్ మీడియాలో క్రేజ్ భారీ స్థాయిలో ఉంది. కమర్షియల్ సినిమాలకు మాత్రమే ఓటు వేయడం ఈ హీరోలకు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్, నితిన్ తమ రేంజ్ ను పెంచుకోవాల్సి ఉంది.
టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలకు ఈ మధ్య కాలంలో కలిసిరావడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో లక్ పరీక్షించుకుంటున్న హీరోలకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలకు భవిష్యత్తులో అయినా భారీ సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. నితిన్, రామ్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నితిన్, రామ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉందని తెలుస్తోంది.