సినిమాల్లో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్పోర్ట్స్ మ్యాన్స్ నటించినట్లయితే ఆ సినిమాలపై ప్రేక్షకులు అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కొంతకాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మైక్ టైసన్ ఓ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన బాక్సర్లలో ఒకరు అయినటువంటి మైక్ టైసన్మూవీ లో చిన్న క్యామియో పాత్రలో కనిపించనున్నాడు అని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ఇక సినిమా విడుదల అయిన తర్వాత మైక్ టైసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం , సినిమా కూడా అస్సలు బాగో లేకపోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా నితిన్ "రాబిన్ హుడ్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుములమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ ఓ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో రాబిన్ హుడ్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.

ఇక నిన్న అనగా మార్చి 28 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అలాగే డేవిడ్ వార్నర్ పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదు అని అనేక మంది ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలా తెలుగు సినిమాల్లో అద్భుతమైన క్రేజ్ ఉన్న స్పోర్ట్స్ మ్యాన్స్ నటించిన సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కావడం లేదు అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్త పరుస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: