టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను , అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న బ్యూటీలలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె ఉప్పెన మూవీ తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు కూడా వరుసగా విజయాలను అందుకోవడంతో ఈమె చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన సినిమాలు వరుస పెట్టి బోల్తా కొడుతూ వచ్చాయి. ఆఖరుగా ఈమె తెలుగు లో మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కాస్త పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. ఇకపోతే ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా అయినటువంటి ఉప్పెన నుండే ఈమె వెండి తెరపై తన అందాలను ఆరబోయడం మొదలు పెట్టింది. అలా ఇప్పటికే చాలా సినిమాల్లో తన అందాలను ఆరబోసి వెండి తెరపై కూర్ర కారుకు సెగలు పుట్టించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా కృతి శెట్టి అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks