మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ.లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల అయింది. ఇక భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండగా ... మైత్రి , వృద్ధి సినిమాస్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... పెద్ది సినిమాలో చరణ్ ఉత్తరాంధ్ర మండలికంలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో చరణ్ అభిమానులు ఉత్తరాంధ్ర మండలికంలో చరణ్ తన అద్భుతమైన నటనను ప్రదర్శిస్తాడు అని , సినిమా ఖచ్చితంగా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంటుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: