ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ చాలా సంవత్సరాల క్రితం ఆదిత్య 369 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఏప్రిల్ 4 వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఉగాది రోజున ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతున్నట్లు , దానికి బాలకృష్ణ విచ్చేయనున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీ రిలీజ్ లో భాగంగా సింహాద్రి మూవీ కి మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. మరి ఆదిత్య 369 సినిమాకి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మరి ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చి , ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లను వసూలు చేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: