సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస పేట్టి విజయాలను అందుకోవడం అంత ఈజీ విషయం ఏమీ కాదు. కొంత మంది మాత్రమే వరుస పెట్టి విజయాలను అందుకుంటూ వస్తారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కొంత కాలం క్రితం ఎంట్రీ ఇచ్చిన ఓ యువ నటుడు కెరియర్ను ప్రారంభించిన మొదటి సినిమాతో మాత్రమే కాకుండా వరుస పెట్టి ఆయన నటించిన మూడు సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఇంతకు ఆ నటుడు ఎవరు ..? ఏ సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నీ నితిన్ "మ్యాడ్" అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో నటుడిగా నార్ని నితిన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన తన కెరీర్లో రెండవ మూవీ గా ఆయ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా నార్నీ నితిన్ "మ్యాడ్" మూవీ కి కొనసాగింపుగా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ నిన్న అనగా మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం పక్క అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇదే కానీ జరిగితే ఈయన నటించిన మూడు సినిమాలతో కూడా విజయాలను అందుకున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: