సరైన హీరోయిన్ పాటలు , ఫైట్లు హుక్ స్టెప్‌లు మంచి పబ్లిసిటీ ఇవి ఉంటే చాలు సినిమాను అవే లాగేస్తాయని అనుకుంటే అది పెద్ద పొరపాటు అని చెప్పె రోజులు ఇప్పుడు వచ్చేసాయి .. అంతకుమించి కాస్త కథ మరీ కాస్త వైవిధ్యం అనే కొత్త పలుకులు కూడా కావాలని ప్రజెంట్ సినిమాల పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది .. అయితే కొందరు హీరోలు మారారు , కొందరు మారుతున్న ఇంకా సరిపోవటం లేదు .. మరి ఇంకొందరు ఇంకా మారాల్సి ఉంది . నాని లాంటి హీరోలు అందరికన్నా ముందుగా మేల్కొన్నారు ..


 దెబ్బలు తింటే తిన్నాం అదే రూట్ లో వెళ్లారు .. అలా అని మారినందుకు గట్టి విజయాలు కూడా అందుకున్నాడు . అల్లరి నరేష్ , వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు కానీ వారికి సరైన స్టోరీలు మాత్రం దొరకటం లేదు కానీ ప్రస్తుతం ప్రయత్నం అయితే మొదలుపెట్టారు కనుక ఎప్పటికైనా ఈ దిశగా వారు సక్సెస్ అందుకుంటారు ..రామ్ , నితిన్ లాంటివాళ్ళు ఇంకా ఈ వారు వెనకాల ఉండిపోయారు .  రామ్ ఇంకా తన రొటీన్ మాస్ సినిమాలే చేస్తున్నారు .. నితిన్ కూడా తనకు అవే నొప్పుతాయి అనుకుంటున్నాడు. అందుకే సక్సెస్ లు సరిగ్గా రావటం లేదు .. ఇక్కడ సీనియర్ హీరోల విషయం వేరేగా ఉంది .. ఇక వారిది అటూ ఇటూ కానీ పరిస్థితి అటు మరి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళలేరు ఇటు అలా అని రొటీన్ సినిమాలు చేయలేరు ..


చిరంజీవి , రవితేజ , బాలయ్య ఏదో వీలైనంతగా వారి ప్రయత్నం వారు చేస్తున్నారు .. అయితే వాళ్లకి అంత ఎలాంటి సమస్య లేదు .. ఎంతో కెరీర్ ఎన్నో సినిమాలు చూశారు .. అయితే ఇప్పుడు ఏదో అలా మెల్లగా తొందరపడకుండా సినిమాలు చేసి సెటిల్ గా ఉన్నారు .. కానీ రాంమ్ లాంటి మీడియం రెంజ్‌ హీరోలు కన్నా ఇంకా చిన్న రేంజ్ హీరోలు కూడా ఉన్నారు .  అసలు వీళ్ళ సినిమాలకు ఓపెనింగ్ కూడా సరిగా రావడం లేదు .. సరైన థ్రిల్లర్ జోనర్ సినిమాలు వీరికి దిక్కుగా మారాయి .. కానీ వీళ్లు కూడా మాస్  సినిమాలు చెసి కెరియర్ను సంకనాకిచ్చుకుంటున్నారు .. ఇలా మొత్తంగా టాలీవుడ్ ఇప్పుడు గట్టి మార్పు కోరుకుంటుంది హీరోలంతా అది గమనించి ఎవరి లెవల్ కు వాళ్ళు అనుగుణంగా వారి సినిమాల్లో మార్పులు తెచ్చుకోవాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: