టాలీవుడ్ నటుడు నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుములమూవీ కి దర్శకత్వం వహించాడు. జీ వీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. రాజేంద్రప్రసాద్ , వెన్నెల కిషోర్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఇకపోతే గతంలో నితిన్ , వెంకీ కుడుముల కాంబోలో భీష్మ అనే మూవీ వచ్చి మంచి విజయం సాధించడంతో రాబిన్ హుడ్ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా నిన్న అనగా మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమాకు పర్వాలేదు అనే టాక్ ప్రేక్షకుల నుండి వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్లు లభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి జీ 5 ఓ టి టి సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ ని జీ 5 ఓ టి టి సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: