
మేకింగ్ లో పృథ్విరాజ్ కు తనకంటూ ప్రత్యేక స్టైల్ ఉంది. మొదటి సినిమా లూసిఫర్ లోనే అది చూపించాడు .. కానీ దర్శకుడుగా మూడో సినిమాకు వచ్చేసరికి పూర్తిగా కేజిఎఫ్ మాయలో పడినట్టు గట్టిగా కనిపించింది . ఎంపురాన్ కథ రాసుకునే టైం కు కేజిఎఫ్ 2 రిలీజ్ అయింది .. పాన్ ఇండియా లవ్ లో భారీ హిట్ అయింది .. ఇప్పుడు అదే ఛాయలు ఎంపురాన్ (లూసిఫర్ 2) లో గట్టిగా కనిపించాయి .. సినిమాలో స్క్రీన్ ప్లే తో పాటు ప్రతి సీన్లో వచ్చిన ఎలివేషన్స్ చూసిన ఎవరికైనా కేజీఎఫ్ సినిమా గుర్తుకు రాకుండా ఉండదు ..
అలాగే లూసీఫర్ 3 కూడా ఉందంటూ సినిమా చివర్లో చూపించిన సన్నివేశాలు అయితే అచ్చం కేజిఎఫ్ సెట్ ను గుర్తుకు తెచ్చాయి .. ఒరిజినాలిటీకి పెట్టింది పేరైన మలయాళం సినిమా నుంచి ఇలా కేజిఎఫ్ ను అనుసరిస్తూ ఎంపురాన్ 2 రావడం ఎంతవరకు కరెక్టో దర్శకుడు పృథ్వీరాజ్‌కే తెలియాలి .. ఇప్పటికే కబ్జా , మైకేల్ , విక్రాంత్ రోణా లాంటి చాలా సినిమాలు కేజిఎఫ్ ను పోలి వచ్చి బొక్క బోర్ల పడ్డాయి . ఇక ఇప్పుడు ఏంపురాన్ ఆ లిస్టు లోకి వెళ్లకూడదని ఆశిద్దాం .