రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈయన నటుడిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో ఆయన రేంజ్ మారిపోయింది. దాంతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు.  ఆ తర్వాత ఆ రేంజ్ విజయాలు పడలేదు.  వరుసగా నాలుగు సినిమాలు కూడా బోల్తా కొట్టాయి. ఖుషి కాస్త రిలీఫ్ ఇవ్వగా ది ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ గానే నిలిచింది.  ఇక ఇప్పుడు చాలాకాలం తర్వాత ఒక జాతీయస్థాయి ఈవెంట్లో పాల్గొన్న ఈయన ఇందులో ఇండియన్ సినిమా గురించి మాట్లాడడమే కాకుండా బాహుబలి సినిమా కోసం రాజమౌళి, ప్రభాస్ ఎంత కష్టపడ్డారో  చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ ఒకప్పుడు ఆడియన్స్ రీచ్ కోసం ఎంతో స్ట్రగుల్ పడింది.  ముఖ్యంగా బాహుబలి సినిమా సమయంలో టాలీవుడ్ కూడా ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసింది. పైగా రాజమౌళి, ప్రభాస్,  దగ్గుబాటి రానా వంటి స్టార్స్ ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. మార్కెట్ కు మించి ఖర్చు చేశారు. దీంతో ఒక దశలో ఆడియన్స్ రీచ్ కోసం కూడా వారు ఎంత స్ట్రగుల్ పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు.కానీ బాహుబలి సక్సెస్ కొత్త మార్కెట్ ను ఏర్పాటు చేసి.. ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. లాంగ్వేజ్ బారియర్స్ ని బ్రేక్ చేసింది . తెలుగు సినిమా పాన్ ఇండియా మూవీగా ఎదిగింది.  ఇప్పుడు అంతా కూడా సౌత్ సినిమాలు చూడడం కోసం ఎదురుచూస్తున్నారు. అందులో నేను కూడా భాగమవడం చాలా గర్వంగా ఉంది. ఇంత కష్టానికి కారణం ప్రభాస్,  రాజమౌళి అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తూ వారిని ఆకాశానికి ఎత్తేసారు విజయ్ దేవరకొండ.

ఇకపోతే ఆరేడేళ్ల క్రితం విజయ్ దేవరకొండ అంటే ఎవరికీ తెలియదు.  కానీ ఇప్పుడు దేశం అంతా కూడా తెలుసు.  ఇదంతా సినిమా అలాగే ఆడియన్స్ చూపించే ప్రేమ వల్లే సాధ్యమైంది అంటూ తెలిపారు.  మన ప్రయత్నం జెన్యూన్ గా ఉంటే ఆడియన్స్ ప్రేమిస్తారని,  తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడతారని అందుకు తానే ఉదాహరణ అని కూడా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: