సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ..? అసలు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు హిట్ అవుతాయి..? ఏ హీరో సినిమాలో నటిస్తే ఆ మూవీస్ బాగా ఆదరిస్తారు..? ఎటువంటి కాన్సెప్ట్ మూవీని తెరకెక్కించాలి ఇలా రకరకాలుగా టాక్ వినిపిస్తుంది . మరి ముఖ్యంగా బడా బడా స్టార్స్ భారీ బడ్జెట్లో నటించే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి . ప్రస్తుత్తం ఏ సినిమా హిట్ అవుతుంది..? ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది బాగా తలనొప్పిగా మారిపోయింది. చిన్న కాన్సెప్ట్ చిన్న బడ్జెట్ లో తెరకెక్కించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.  రీసెంట్గా వచ్చిన "కోర్టు" మూవీ ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే.


చాలా చాలా చిన్న కాన్సెప్ట్ . ఒక ఆడపిల్లను పరువుగా భావించే ఒక పెద్ద మనిషి ఎలా డబ్బుతో పరువు కోసం ఎదుట అబ్బాయిని హింసించ్చాడు అనేది కోర్టు కాన్సెప్ట్ . అయితే ఈ కాన్సెప్ట్ చాలా చాలా జెన్యూన్.. నిజమైనదే . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే బడా బడా సినిమాలు ..కోట్లు ఖర్చ్గు చేసి తెరకెక్కించిన ప్రాజెక్టులు ప్లాప్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన రాబిన్  హుడ్ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు .



కానీ సినిమాకి అంత సీన్ లేదు అంటూ తేలిపోయింది . ఈ క్రమంలోనే అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ..? ఈ యంగ్ హీరోస్ ఇక మారరా..? ఎప్పుడు అదే లవ్ స్టోరీ నా..? వేరే కొత్త కాన్సెప్ట్ తెరకెక్కించరా..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ యంగ్ హీరోస్ కి కెరియర్ ఫుల్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లాలి అంటే వీళ్ళు మారాలి అని సరికొత్త కాన్సెప్ట్ చూస్ చేసుకోవాలి అని సజెషన్స్ వినిపిస్తున్నాయి. చూద్దాం మరి యంగ్ హీరోలు ఎటువంటి కథలను చూస్ చేసుకుంటారు అనేది...??

మరింత సమాచారం తెలుసుకోండి: