ఇక చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన మూవీ మరొకరు చేయడం ఎంతో కామన్ .. కథ నచ్చకపోవటం నచ్చిన అనుకొని కారణాలతో మూవీ ఆగిపోవడం ఆ తర్వాత వేరే హీరో దగ్గరకు వెళ్ళటం ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది . సీనియర్ హీరో రాజశేఖర్ జీవితంలో ఇలాంటివి చాలా జరిగాయి .. బాలకృష్ణ కూడా తన కెరియర్ లో చాలా సినిమాలను రిజెక్ట్ చేశారు .. అయితే వీళ్ళిద్దరూ రిజెక్ట్ చేసిన సినిమాతో వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ అందుకోవటం ఇక్కడ మరో విశేషం .. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అనేది ఇక్కడ చూద్దాం . విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో చంటి కూడా ఒకటి .. మీనా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 1992లో రిలీజ్ అయింది . రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాని తమిళంలో వచ్చిన చిన్న తంబికి రీమేగా తెర్కక్కించారు .. కోలీవుడ్ లో ఈ మూవీ ని చూసిన్న నిర్మాత కె.ఎస్ రామారావు తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్నారు ..


ముందుగా ఈ స్టోరీని బాలకృష్ణకి చెప్పారు కానీ ఆయన రిజెక్ట్ చేశారు. తనకు ఎలాంటి సినిమాలు సెట్ కావని కూడా చెప్పారట . ఆ తర్వాత రాజశేఖర్ వద్దకు కూడా వెళ్ళింది .. ఈ స్టోరీకి ఆయన బాగా సూట్ అవుతారు అనుకున్నారు .. అయితే ఆ సమయంలో మాస్ యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్నారు రాజశేఖర్ విజయాలతో క్రేజీ స్టార్ గా ఉన్నారు చిరంజీవికి పోటీగా దూసుకుపోతున్నారు అలాంటి సమయంలో తాను ఇలాంటి సినిమా చేస్తే ఇమేజ్ దెబ్బతింటుందని భావించిన రాజశేఖర్ చంటి కథ‌కు నో చెప్పారు . ఆ తర్వాత మరో హీరో వద్దకు కూడా వెళ్ళింది .. ఇక రవిరాజా పినిశెట్టి దర్శకుడుగా ఓకే అయ్యారు .. రాజేంద్రప్రసాద్మూవీ చేయాలని నిర్ణయించుకున్నారు . ఆల్మోస్ట్ అంతా కన్ఫామ్ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది . కానీ చివరి నిమిషంలో హీరో మారిపోయాడు .. అప్పటికే తమిళంలో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది .. ఇక దాంతో రాజేంద్రప్రసాద్ ఇమేజ్ సరిపోదని భావించిన చిత్ర యూనిట్  వెంకటేష్ వద్దకు వెళ్లారు .. ఆ తర్వాత ఈ సినిమా కథను వెంకటేష్ అన్న సురేష్ బాబు వినగానే సినిమా చేయడానికి ఒకే చెప్పారు .. వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది ..


అలా ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేసి 1992 సంక్రాంతికి రిలీజ్ చేశారు .. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది .. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలడమే కాకుండా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది .. ఈ సినిమా సుమారు 16 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిందని టాక్ .. అప్పట్లో ఇది పెద్ద సంచలమని కూడా అంటారు . ఇలా బాలయ్య రాజశేఖర్లు నో చెప్పి , రాజేంద్రప్రసాద్ హీరోగా అనౌన్స్ చేసే సమయంలో చివరికి వెంకటేష్ వద్దకు చంటి కథ‌ వెళ్లడం ఆయన చేయటం ఇంత పెద్ద విజయం సాధించడం అన్నీ ఊహించిన విధంగా జరిగిపోయాయి .. అందుకే అంటారు కొన్నిసార్లు డెస్టినేషన్ అన్ని నడిపిస్తుందని .. ఎవరు ఏది చేయాలో కాలమే నిర్ణయిస్తుంది అలానే ఈ సినిమా విషయంలో అదే జరిగిందని కూడా చెప్పవచ్చు ..

మరింత సమాచారం తెలుసుకోండి: