మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం లూసిఫర్ 2: ఎంపురాన్.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ఈనెల 27వ తేదీన విడుదల అవ్వగా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు.
ముఖ్యంగా అటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో  సినిమా కలెక్షన్లు కూడా భారీగా పెరిగిపోయాయి. వీకెండ్ పూర్తయ్యే లోపు మరిన్ని కలెక్షన్లు వస్తాయని, సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోవడం అంటే మామూలు విషయం కాదని నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ సినిమా భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకొని మోహన్లాల్.. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్ల పరంగా బిజీగా దూసుకుపోతుండడంతో ఆయన దాతృత్వానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.

సినిమా స్టోరీ విషయానికి వస్తే జతిన్ రామ్దాస్ ( టోవినో థామస్) ను ముఖ్యమంత్రి చేసిన తర్వాత కేరళ వదిలి విదేశాలకు వెళ్లిపోతారు స్టీఫెన్ (మోహన్ లాల్). సీఎం పదవి చేపట్టి ఐదేళ్లు పూర్తి కాకముందు తండ్రి వారసత్వాన్ని,  ఆయన పార్టీని వదిలి కొత్త పార్టీని స్థాపిస్తాడు జతిన్. హిందుత్వవాది బాబా భజరంగితో చేతులు కలుపుతాడు. తన  నిర్ణయాన్ని తన అక్క ప్రియదర్శిని వ్యతిరేకిస్తుంది.దాంతో  కేరళ రాష్ట్రాన్ని కాపాడడానికి స్టీఫెన్ మళ్ళీ రావాలని చాలామంది కోరుకుంటారు. అయితే ఇరాక్ లో డ్రగ్ కార్టల్ మీద జరిగిన దాడిలో అతడు చనిపోయాడని వార్తలు వస్తాయి. మరి నిజంగానే స్టీఫెన్ చనిపోయాడా?  స్టీఫెన్ గా ప్రజలకు తెలిసిన ఖురేషి అబ్రహం ఏం చేస్తాడు?  రాజకీయాల్లో అతడు ఏం చేశాడు?  అతని కోసం కొన్ని దేశాలు ఎందుకు వెతుకుతున్నాయి?  అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: