టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి కాలంలో హీరోయిన్లు ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు లేకుండా చాలా సాంప్రదాయంగా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక నేటి కాలంలో మాత్రం కొంతమంది హీరోయిన్లు కేవలం ఎక్స్పోజింగ్ మాత్రమే చేసుకుంటూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక నటి సమంత కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ దూసుకుపోతోంది.


ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ చిన్నది సినీ ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 10 ఏళ్లకు పైనే అయింది. అయినప్పటికీ ఇప్పుడు కూడా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. ప్రస్తుతం సమంత టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ సినిమాలలో రాణిస్తున్నారు. సమంతకు తెలుగు, హిందీలో కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిన్నదాని సినిమా వస్తుందంటే చాలు జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు.


కాగా సమంత కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా గత కొద్ది రోజుల క్రితం ఐటమ్ సాంగ్ లోను చిందులు వేసి ప్రేక్షకులను కట్టిపడేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసింది. ఇందులో ఊ అంటావా మామ అంటూ సాగే పాటకు స్టెప్పులు వేసి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. స్పెషల్ సాంగ్ చేసినందుకు గాను సమంత భారీగానే డబ్బులను వసూలు చేసిందట. ఆ తర్వాత సమంతకు మరికొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అవకాశాలు వచ్చినప్పటికీ సమంత అసలు ఒప్పుకోలేదట.


ఇక ఇప్పుడు ఏకంగా ఈ బ్యూటీ కి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని కేవలం స్పెషల్ సాంగ్ మాత్రమే చేయాలని ఓ నిర్మాత ఆఫర్ చేశారట. కానీ సమంత 100 కోట్లు ఇచ్చిన ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను ఐటమ్ సాంగ్ చేయను అంటూ ఖరాఖండిగా చెప్పేసిందట. ఈ విషయం తెలిసి సమంత అభిమానులు తన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నారట. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: