తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది యాంకర్లు మాత్రమే వారి అందం, హో స్టింగ్ స్టైల్, చలాకీతనంతో మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. ఈ చిన్నది పోవే పోరా షోతో తెలుగు తెరకు పరిచయమైంది. కేవలం ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ అందుకుంది. అనంతరం వివిధ ప్రోగ్రామ్ లలో యాంకర్ గా తన కెరీర్ హ్యాపీగా కొనసాగించింది. అంతేకాకుండా వివిధ ప్రోగ్రామ్ లలో పాల్గొని తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. 

సోషల్ మీడియా లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్ కి వెళ్లడం అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో అవి వైరల్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా విష్ణుప్రియ హాట్ గా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తన అందాల ఆరబోతలో ఈ చిన్నది ఏమాత్రం రాజీ పడడం లేదు. సినిమా అవకాశాల కోసం విష్ణు ప్రియ తన అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్లు చేస్తోంది.

ఇక ఈ చిన్నది రీసెంట్ గా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో పృద్వితో కలిసి ఈ చిన్నది ప్రేమాయణం కొనసాగించింది. బిగ్బాస్ షోలో వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీకి అభిమానులు ఎంతగానో ఫిదా అయ్యేవారు. వీరిద్దరు వివాహం చేసుకుంటే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు అనుకున్నారు. ఇదిలా ఉండగా.... యాంకర్ విష్ణు ప్రియకు ఓ టాలీవుడ్ హీరో దగ్గర అవుతున్నారట. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని, త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ చిన్నదానికి సంబంధించి ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: