
ఇకపోతే ప్రస్తుతం తెలుగులో ఓదెలా 2 సినిమా చేస్తున్న ఈమె.. ఈ సినిమాలో తొలిసారి నాగసాద్విగా కనిపించబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఊహించని ఇమేజ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా జ్యువెలరీతో డిజైన్ చేసిన ఒక డ్రెస్ ధరించి తన అందంతో మరొకసారి యువతను కట్టిపడేసింది. బ్లాక్ అవుట్ ఫిట్ పై యోక్ భాగం మొత్తం గోల్డెన్ కలర్ జ్యువెలరీతో డిజైన్ చేసినట్టుగా చాలా అద్భుతంగా రూపొందించారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె అందాలు చూసి నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అమ్మడి అందానికి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమన్నకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.