తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అందులో ఒకప్పటి నటి శ్రీయాశరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. చీరకట్టు, బొట్టు, అందంతో ఒకానొక సమయంలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి తన హవాను కొనసాగించింది. ప్రస్తుతం శ్రీయాశరణ్ తెలుగు, హిందీ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది.


వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిన్నది తన కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. వివాహ అనంతరం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన అనంతరం శ్రియ తన మహాతృత్వాన్ని ఆస్వాదించింది. కొద్ది రోజున అనంతరం ఎప్పటిలానే మళ్లీ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంది.

 
కాగా, శ్రీయాశరణ్ సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఓ హీరో తనని మోసం చేశాడట. తనను ప్రేమిస్తున్నానని, వివాహం కూడా చేసుకుంటానని చెప్పాడట. అంతే కాకుండా తనకు సినిమాలలో అవకాశాలు వచ్చేలా చేస్తానని ఎంతో నమ్మించారట. కానీ చివరికి తనకు సినిమా అవకాశాలు ఇప్పించకపోగా తనను వివాహం కూడా చేసుకోలేదట.

కానీ శ్రియ దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన టాలెంట్ ను నమ్ముకొని సినిమాలలో నటించి తన సత్తాను చాటుకుంది. ఇక ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు తెలియనప్పటికీ శ్రియ మాత్రం ప్రస్తుతం తన సినీ కెరీర్ పరంగా దూసుకుపోతుందని చెప్పవచ్చు. కాగా ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూ తన అభిమానులకు చేరువలో ఉంటుంది. తన భర్త, తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారిని అలరిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: