టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు పరిచయమైన మొదటి సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా చేసి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా రకుల్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు.


సినిమా అనంతరం ఈ చిన్నది తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును అందుకుంది. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్ గా చేసి తన హవాను కొనసాగించింది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ఇక సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే జాకీ భగ్నానినీ ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఈ చిన్నది తన అందాల ఆరబోతులో ఏమాత్రం రాజీ పడడం లేదు.


హాట్ గా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ కుర్రాళ్ళ మనసులను దోచుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే అందాల ఆరబోతకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ చిన్నదానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. రకుల్ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసినట్లుగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ వెల్లడించారు. కాలేజీ చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్ చేసినట్లుగా రకుల్ చెప్పారు. కన్నడ పరిశ్రమలో మొదటిసారిగా సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన అనంతరం పూరి జగన్నాథ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

 70 రోజులు నా డేట్స్ కావాలని కోరారు. అప్పటికి నేను చదువుకుంటుండడంతో నాలుగు రోజులు మాత్రమే నా డేట్స్ ఇవ్వగలనని చెప్పాను. దాంతో పూరి జగన్నాథ్ కుదరదని చెప్పారు. ఇక ఆ సినిమాను రిజెక్ట్ చేశానని రకుల్ వెల్లడించారు. ఆ ఒక్క సినిమానే కాకుండా తన డేట్స్ కుదరకపోవడం వల్ల ఎన్నో సినిమాలలో అవకాశాలను వదులుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం రకుల్ షేర్ చేసుకున్న ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: