
ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అటు నితిన్, ఇటు శ్రీలీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. రాబిన్‌హుడ్ సినిమా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కి అందాల భామ కేతిక శర్మ స్టెప్పులేసిన విషయం అందరికీ తెలిసిందే. అదిదా సర్ ప్రైజ్ అనే సాంగ్ కి చిందులేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
ఈ పాటకి కేతిక శర్మ వేసిన స్టెప్పులను చూసిన ప్రేక్షకులు తెగ ట్రోల్ కూడా చేశారు. ఈ పాటకి స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. అయితే ఇటీవల అదిదా సర్ ప్రైజ్ సాంగ్ పైన నెటిజన్స్ ఫైర్ అయ్యారు. అదిదా సర్ ప్రైజ్ సాంగ్ హుక్ స్టెప్పుపైన ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ బహిరంగ లేఖ రాశారు. దీంతో సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి కాంట్రవర్సీ జరగకుండా పాటలోని ఆ హుక్ స్టెప్పుని తీసేశారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. కానీ సినిమాలో మాత్రం ఆ హుక్ స్టెప్ ని కనిపించకుండా చేసి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు.