- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట సింహం బాలకృష్ణ వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు .. బోయపాటి శ్రీను దర్శకత్వం లో బాలయ్య నటించిన అఖండ సినిమా తో మొదలైన బాలయ్య విజయాల ప్రస్థానం వరుసగా అఖండ , వీరసింహారెడ్డి , భగవంత్‌ కేసరి , డాకు మహారాజ్ సినిమాలతో ఫుల్ స్వింగ్లో దూసుకుపోతోంది .. బాలయ్య కెరీర్ లో వరుసగా నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు పడటం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత జరగటం విశేషం .

సంక్రాంతికి డాకు మహారాజు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు .. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య మహారాజ్‌ పాత్రలో నటించారు .బాలయ్య కి జోడిగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటెలా , శ్రద్ధ శ్రీనాథ్ , చాందిని చౌదరి కూడా కీలక పాత్రలలో నటించారు .. తమన్ అందించిన సంగీతం నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది . సంక్రాంతికి రామ్‌చరణ్ గేమ్ చేంజర్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం సినిమాలకు పోటిగా వచ్చి డాకు మహారాజ్ ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది .. 10 కేంద్రాలకు పైగా అర్థ శత శతదినోత్సవం జరుపుకున్న డాకు మహారాజ్‌ సినిమా తన సినిమాలకు కంచుకోట ఆయన కేంద్రంలో శత దినోత్సవ వైపు పరుగులు పెడుతుంది .. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట అంటేనే బాలయ్య సినిమాలు వరిసిపెట్టి సెంచరీలు కొట్టేస్తూ ఉంటాయి. బాలయ్య డిజాస్టర్ యావరేజ్ సినిమాలు కూడా చిలకలూరిపేటలో వంద రోజులు ఆడాయి .. చిలకలూరిపేట లోని రామకృష్ణ థియేటర్లో బాలయ్య నటించిన అఖండ , వీరసింహారెడ్డి , భగవత్ కేసరి సినిమాలు సెంచరీలు ఆడేశాయి .. తాజాగా డాకు మహారాజ్ సినిమా ఇప్పటికే 80 రోజులు పూర్తి చేసుకుని ఈ థియేటర్లో మరోసారి సెంచరీ కొట్టినందుకు పరుగులు పెడుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: