టాలీవుడ్ లో ఇప్పుడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకు వెళుతున్న దర్శకులలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఒకరు .. 2015 లో కళ్యాణ్రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో మెగాఫోన్ పట్టి దర్శకుడుగా తెలుగు తెరకు పరిచయమైన అనిల్ రావుపూడి .. అక్కడి నుంచి వరుస సూపర్ డూపర్ హిట్స్ సినిమాలతో దూసుకుపోతున్నారు .. వరుసగా పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , భగవంతు కేసరి , ఎఫ్ 2 , ఎఫ్3 , సరిలేరు నీకెవ్వరు తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాల తో అన్ని సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు .


మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ , రవితేజ , కళ్యాణ్ రామ్ , సాయి ధరంతేజ్ , బాలకృష్ణ ఇలా సీనియర్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు వరుసగా అందరితోనూ సినిమాను తీసి సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావు పూడి .. తర్వాతి సినిమా సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవితో ఉండనుంది .. రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి కెరీర్ అనుకున్నంత ఆశాజనకంగా ముందుకు సాగటం లేదు .. పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి రీయంట్రీ  ఇచ్చాక కమర్షియల్ గా చెప్పుకోవాలి అంటే ఒక వాల్తేరు వీరయ్య మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది .. సైరా , బోళ‌ శంకర్ , ఆచార్య పెద్ద డిజాస్టర్లు అయ్యాయి .. ఖైదీ నెంబర్ 150 రీమిక్‌ సినిమా ఇక విశ్వంభర సినిమాపై కూడా పెద్దగా ఎవరికి అంచనాలు లేవు .. ఇలాంటి టైంలో చిరంజీవి తో కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావుపూడి సినిమా చేయటం అంటే అది అనిల్ కెరీర్ కె పెద్ద రిస్క్ అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ..


చిరంజీవి మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది పైగా చిరంజీవి ఇప్పటికీ 55 నుంచి 60 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు .. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఫామ్ లో ఉండడంతో 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది .. ఓవరాల్ గా ఈ సినిమా బడ్జెట్ 180 నుంచి 200 కోట్ల రేంజ్ లో చెబుతున్నారు .. మరి చిరంజీవి మీద అంత బడ్జెట్ పెట్టి కామెడీ సినిమా తీస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్న సందేహాలు ఉన్నాయి .. ఏది ఏమైనా మరోసారి సంక్రాంతికి వస్తున్నాం మ్యాజిక్ రిపీట్ అయితే తప్ప చిరంజీవి పై రెండు వందల కోట్ల బడ్జెట్ పెద్ద రిస్క్ అని టాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి .. మరి అనిల్  ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాల్సి ఉంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: