థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఉగాది పండుగ కానుకగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏవో తెలుసుకుందాం.
 
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల లిస్ట్ చూద్దాం. ఓటీటీ ఫ్లాట్ ఫామ్  అయిన అమెజాన్ ఫ్రైమ్ లో అన్పోడు కన్మణి అనే మలయాళం సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోగా అర్జున్ అశోకన్ నటించాడు. అనఘా నారాయణన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా సినిమా జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆడుతుంది. ఈ సినిమాకు దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రీతువర్మ నటించింది. మజాకాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఆహా తమిళం ఓటీటీలో మిస్టర్ హౌస్ కీపింగ్ అనే తమిళం రొమాంటిక్ కామిడీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో  హరి భాస్కర్, లోస్లియా మారిన్సన్ ముఖ్య పాత్రలో నటించారు.

 
అలాగే అగత్య సినిమా సన్ ఎన్‌ఎక్స్‌టీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇందులో అర్జున్ సర్జ, జీవి, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. యూఐ అనే కన్నడ సినిమా మార్చి 30న స్ట్రీమింగ్ అవ్వనుంది. ఉగాది కానుకగా జీ5లో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా ఉపేంద్ర నటించారు. తాయి కస్తూర్ గాంధీ అనే మూవీ అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: