సీనియర్ అంటే స్నేహ అందం, అభినయంతో సౌందర్య లాంటి గుర్తింపును సంపాదించుకుంది. అయితే అలాంటి స్నేహ ఈ మధ్యకాలంలో పలు బిజినెస్ లతో పాటు సినిమాల్లో అవకాశాలు వస్తే వాటిని కూడా వదులుకోవడం లేదు.అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న స్నేహ సినిమాల కంటే ఎక్కువగా బిజినెస్ ల పైనే దృష్టి పెట్టింది. అయితే తాజాగా తనకు ఎంతో ఇష్టమైన అరుణాచల ఆలయాన్ని సందర్శించుకుంది హీరోయిన్స్ స్నేహ. తన భర్త ప్రసన్నతో కలిసి అరుణాచలం వచ్చిన స్నేహ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.స్నేహ నటుడు ప్రసన్న ఇద్దరు కలిసి అరుణాచల గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు.అయితే అరుణాచల గిరి ప్రదక్షిణలు చేస్తున్న స్నేహ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ వీరికి ఎంత భక్తో ఈ ఒక్క వీడియో చూసి అర్థం చేసుకోవచ్చు..

సెలబ్రిటీ హోదాను పక్కనపెట్టి అరుణచల గిరి ప్రదక్షణ చేస్తున్నారంటే దేవుడిపై వీరికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందువులంటే ఇలా ఉండాలి సెలబ్రిటీలు అనే గర్వం ఎక్కడా కూడా కనిపించడం లేదు అంటూ ఇలా చాలామంది నెటిజన్లు స్నేహ ప్రసన్నలను పొగుడుకుంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. కానీ అక్కడే ఒక విషయాన్ని పట్టుకొని మరికొంతమంది స్నేహ ప్రసన్నలను విమర్శిస్తున్నారు. అదేంటంటే స్నేహ ప్రసన్న ఇద్దరు అరుణాచల గిరి ప్రదక్షిణలు చేయడం మంచిదే..కానీ అలా చేసే సమయంలో వాళ్లు ఇద్దరూ తమ కాళ్లకు చెప్పులు ధరించారు. చెప్పులు ధరించి అరుణాచల గిరిప్రదక్షిణలు చేయడం ఏంటి అని చాలామంది హిందువులు వీరిపై ఫైర్ అవుతున్నారు. అరుణాచల గిరిప్రదక్షిణ అంటే ఎంత పుణ్య కార్యమో తెలుసా..అలాంటిది గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చెప్పులు ధరిస్తారా.. 

మీరు చేసింది మహా పాపం అంటూ సోషల్ మీడియాలో కొంతమంది హిందువులు స్నేహ ప్రసన్నలపై ఫైర్ అవుతున్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం స్నేహ ప్రసన్నలకి సపోర్ట్ ఇస్తున్నారు.ఎందుకంటే అరుణాచలం గిరి ప్రదక్షిణలు అనేది 14 కిలోమీటర్లు ఉంటుంది.ఇక భక్తులు చెప్పులు వేసుకుని నడవాలా చెప్పులు వేసుకోకుండా నడవాలా అనేది పూర్తిగా వారి ఇష్టం.. దీన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ చాలామంది మాత్రం స్నేహ ప్రసన్న ఇద్దరు చెప్పులు వేసుకొని అరుణాచల గిరి ప్రదక్షిణలు చేయడం అనేది మహాపాపం.. వీరిని ఆ దేవుడు శపిస్తాడు అంటూ విమర్శిస్తున్నారు . ఏది ఏమైనప్పటికీ భక్తి భావంతో వెళ్లి చివరికి విమర్శల పాలయ్యారు స్నేహ ప్రసన్నలు.. అయితే ఇలాంటి విషయాలను చాలామంది హిందువులు నెగిటివ్గా చేసి చూపిస్తారు అలా స్నేహ ప్రసన్నలు హిందువులు ఆగ్రహానికి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: