గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా ఇప్పుడు ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వం లో పెద్ది సినిమా లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .. ఇక మొన్న మార్చి 27 న తన పుట్టినరోజు సందర్భం గా ఎంతో మంది సిని ప్రముఖులు  కూడా చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు .  అభిమానులకు పుట్టినరోజు గిఫ్ట్ గా తాజా మూవీ కి సంబంధించిన టైటిల్ తో పాటు పోస్టర్ ను కూడా ప్రేక్షకులకు అందించాడు .. అయితే ఇప్పుడు తాజా గా మెగా ఇంట చరణ్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన కూల్ వైబ్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి .. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల పోస్ట్ చేసిన పిక్స్ అండ్ పోస్ట్ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారాయి ..
 

అలాగే తనకు మ‌ర్చ్ 27 ఎంతో మెమొరబుల్ గా నిలిచిందని ఆమె ఎమోషనల్ పోస్టు కూడా చేసింది .. ఇక ఆమె షేర్ చేసి న ఫోటోల్లో అయితే రామ్ చరణ్ , చిరంజీవి అలానే సురేఖ , చరణ్ సోదరి తో పాటు కలిసి ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడమే కాకుండా వారి తో పాటుగా అక్కినేని నాగార్జున సహా చిరు స్నేహితుల తో కలిసి చరణ్ పుట్టినరోజు ను సెలబ్రేట్ చేసిన వైబ్స్‌ ఇప్పుడు వైరల్ గా మారాయి .. ఇక ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .. అలాగే రేపు చిరంజీవి , అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మొదలు కాబోతున్నాయి .. అలాగే రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ కూడా ఉగాది కానకగా రేపు రాబోతుంది . ఇలాంటి క్రమంలో పండుగ‌కి కొన్ని గంటల ముందు మెగా అభిమానులకు చరణ్ పుట్టినరోజు ఫోటోలతో ఉపాసన భారీ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: