మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడం తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఈ సినిమా కు మెయిన్ అట్రాక్షన్ ప్రభాస్.. ప్రభాస్సినిమా లో “రుద్ర” అనే పాత్రలో నటిస్తున్నాడు.. సినిమా మొత్తం లో ప్రభాస్ పాత్ర నిడివి 25 నుంచి 30 నిముషాలు ఉంటుందని సమాచారం.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు మంచు ప్రకటించారు..ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నాం..VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం వుంది..అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది.. దీనికి మేము చింతిస్తున్నాం..త్వరలోనే సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విష్ణు తెలిపారు…

మరింత సమాచారం తెలుసుకోండి: