థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఉగాది పండుగ కానుకగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రేపు ఒక కొత్త సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుందో చూద్దాం.
 
యూఐ అనే కన్నడ సినిమా మార్చి 30న స్ట్రీమింగ్ అవ్వనుంది. ఉగాది కానుకగా జీ5లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా ఉపేంద్ర నటించారు. అయితే ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల నుండి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. యూఐ సినిమాకి ఉపేంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా లహరి ఫిల్మ్స్ అండ్ వీనస్ ఎంటర్ టైనర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా.. వేణుగోపాల్, విజయ్ రాజ్ ఎడిటింగ్ చేశారు. ఈ మూవీలో రీష్మా నానయ్య , నిధి సుబ్బయ్య , మురళీ శర్మ , సాధు కోకిల, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలలో నటించారు.


యూఐ సినిమా రేపు సా. 4:30 గంటలకు జీ5 కన్నడ ఛానల్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీ కన్నడతో పాటుగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక థియేటర్ లో మిక్స్డ్ టాక్ ని సొంత చేసుకున్న ఈ సినిమా మరి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి మరి.    


మరింత సమాచారం తెలుసుకోండి: