మెగా కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగా కుటుంబంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ మాత్రమే హీరోలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైతే నాగబాబు మాత్రం హీరోగా తెరకు పరిచయం కాలేకపోయాడు. కానీ సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతేకాకుండా నాగబాబు ప్రొడ్యూసర్ గాను వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన తల్లి పేరు మీదగా అంజన ప్రొడక్షన్స్ సంస్థను నిర్మించి ఎన్నో సినిమాలను నిర్మించారు.


ఇక నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తెలుగు తెరకు హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుణ్ తేజ్ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. చాలా కాలం పాటు ప్రేమించుకున్న వరుణ్, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులను ఒప్పించి గత సంవత్సరం అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత వరుణ్ తేజ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాలలో కూడా నటించలేదు.


దానికి గల ప్రధాన కారణం తనకు సినిమాలలో ఇప్పుడు నటించడానికి పెద్దగా ఆసక్తి లేదట. తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించాలనే ఉద్దేశంతో సినిమాలను పూర్తిగా మానేసినట్టుగా సినీ వర్గాల్లో సమాచారం అందుతుంది. ఇక లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తన తల్లిదండ్రితో కలిసి ఉంటున్నారు. అయితే వారితో నిహారిక కూడా కలిసి ఉంటుంది. వీరు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వేరే ఇంట్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట.

ఎలాంటి గొడవలు లేకుండా ముందుగానే జాగ్రత్తపడి వేరు కాపురం పెడితే బాగుంటుందని భావిస్తున్నారట. అయితే ఈ విషయం నాగబాబుకి తెలియడంతో అతను అసలు ఒప్పుకోవడం లేదట. అందరం కలిసి ఒకే ఇంట్లోనే ఉందామని చెబుతున్నాడట. అయినప్పటికీ వరుణ్ తేజ్ వినకుండా వేరే ఇంటికి వెళ్తామని ఖరాఖండీగా చెప్పేసారట. ఈ విషయం వల్ల నాగబాబు ఇంట్లో ఏదో ఒక పంచాయతీ జరుగుతూనే ఉందట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: