నటి తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హ్యాపీ డేస్ సినిమాతో తమన్నా క్రేజ్ ఎక్కడికి వెళ్లిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమా అనంతరం తమన్నా చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఈ చిన్నది సినీ పరిశ్రమకు పరిచయమై దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతుంది. ఇప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


కాగా, నటి తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటామని వెల్లడించారు. వివాహ అనంతరం కలిసి జీవించడానికి ఓ ఖరీదైన విల్లాను ముంబైలో కొనుగోలు చేసినట్టుగా కూడా బాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త కోడై కూసింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారని అనేక రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఏవో మనస్పర్ధల కారణంగా తమన్న, విజయవర్మ విడిపోయారంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి.


అయితే ఈ వార్తలపై తాజాగా విజయవర్మ స్పందించారు. రిలేషన్షిప్ ను ఓ ఐస్ క్రీమ్ తో పోల్చారు. దానిని ఆధ్యాంతం ఆస్వాదించాలని, అలా చేస్తేనే సంతోషంగా ఉండగలమంటూ విజయ వర్మ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కోపం, సంతోషం, బాధ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని స్వీకరించి ముందుకు సాగాలంటూ విజయ వర్మ అన్నారు. ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.


అయితే వీరి బ్రేకప్ వార్తలపై గత కొద్ది రోజుల క్రితమే తమన్న స్పందించారు. ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీల చూస్తామో అప్పుడే గొడవలు వస్తాయని, అసలైన సమస్యలు మొదలవుతాయంటూ తమన్నా అన్నారు. అయితే వీరు మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఈ జంట విడిపోలేదని కలిసే ఉన్నారని కొంతమంది అంటున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: