వెంకటేష్ దగ్గుబాటి రామానాయుడు కొడుకు కావడంతో నిర్మాత అయిన రామానాయుడు తన కొడుకు వెంకటేష్ సినిమాలో ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లను దింపారు. అలా దివ్యభారతి, కత్రినా కైఫ్,అంజలా జవేరి, ప్రీతి జింటా, శిల్పా శెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోయిన్లు వెంకటేష్ తో ఆడి పాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇతర ఇండస్ట్రీ హీరోయిన్లు ఉంటే ఆ సినిమాకి మరింత పేరు వస్తుంది అనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు అలా హీరోయిన్స్ ని చూస్ చేసుకునేవారట. అయితే వెంకటేష్ అప్పటి హీరోయిన్లందరితో కలిసి నటించారు కానీ ఐశ్వర్యరాయ్ తో మాత్రం కలిసి నటించలేదు. కానీ ఐశ్వర్యరాయ్ వెంకటేష్ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉందట.ఆ సినిమాకి హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ ని ఫిక్స్ చేశాక చివరికి ఆమెను పక్కనపెట్టి మరో హీరోయిన్ ని తీసుకున్నారట.మరి ఇంతకీ ఐశ్వర్యరాయ్ వెంకటేష్ కాంబోలో మిస్సయిన ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి అనుకుంటున్నారా..

మూవీ ఏదో కాదు ప్రేమించుకుందాం రా..జయంత్ సి పరాంజి డైరెక్షన్లో వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకీ సరసన అంజలా జవేరి నటించింది.అయితే అంజలా జావేరి కంటే ముందే వెంకీ సరసన హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ ని అనుకున్నారట డైరెక్టర్. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కి చెప్పగా నో నో ఐశ్వర్యరాయ్ మన సినిమాలో వద్దు. ఇప్పటికే ఆమె నటించిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఐరన్ లెగ్ హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది. అలాంటి ప్లాప్ సినిమాలు ఉన్న హీరోయిన్ ని మన సినిమాలో పెట్టుకుంటే ఆ ఎఫెక్ట్ మన సినిమాపై పడుతుంది ఆమె వద్దు అంటూ చెప్పారట. కానీ డైరెక్టర్ మనసులో మాత్రం ఐశ్వర్యరాయ్ మాత్రమే ఉందట. కానీ చేసేదేమీ లేక హీరోయిన్ గా అంజలా జవేరిని పెట్టుకున్నారట.

అయితే అంజలా జవేరి వెంకీ కాంబోలో వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇక ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిన జయంత్ సి పరాంజి ప్రేమించుకుందాం రా సినిమాలో మొదటి హీరోయిన్గా ఐశ్వర్యరాయ్ ని అనుకున్నానని, కానీ ఆమె చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో మూవీ యూనిట్ ఆమెని హీరోయిన్గా ఒప్పుకోలేదని తెలియజేశారు. కానీ ఎప్పటికైనా ఐశ్వర్య రాయ్ తో సినిమా చేయాలి అనే ఉద్దేశంతో నాగార్జునతో చేసిన రావోయి చందమామ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నాను అంటూ డైరెక్టర్ జయంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా ప్రేమించుకుందాంరా సినిమా ఐశ్వర్య రాయ్ వెంకటేష్ కాంబోలో మిస్సయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: