
తనకు ఇష్టం లేకపోయినా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా కూడా నటించాల్సి వచ్చిందంటూ తెలియజేసింది. 2021 లో విడుదలైన నాట్యం సినిమా డైరెక్టర్ రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక క్లాసికల్ డాన్సర్ సంధ్య రాజు ప్రధాన పాత్రలో నటించారు. సంధ్య రాజు తల్లి పాత్రలో భానుప్రియ నటించింది.. ఈ సినిమాల తన పాత్ర కు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ కూడా కథ చెప్పినప్పుడు పాత్ర బాగానే ఉందని తీర సినిమా షూటింగ్ కి వెళ్లిన తర్వాత అక్కడ ఆశ్చర్యపోయానని తెలిపారు.
సినిమాలో తన పాత్ర కూతురిని ఎంకరేజ్ చేసే పాత్ర అని చెప్పారు.. కానీ అక్కడ అలా కనిపించలేదు మధ్యలో ఆపివేస్తే గొడవలు అవుతాయి ఎందుకని తన పాత్రను పూర్తి చేశానని కానీ సినిమా చేసిన తర్వాత తనకు తప్పు చేశానేమో అని ఫీలింగ్ కలిగిందని వెల్లడించింది. ఇలా ఇదే కాకుండా గతంలో కొన్ని చిత్రాలలో కూడా నటించానని అప్పుడు కూడా ఇలాగే జరిగిందని తెలియజేసింది భానుప్రియ. ఇది వలె ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ చేస్తూ ఈ విషయాలను తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.