అక్కినేని అమల.. నాగార్జున ని పెళ్లి చేసుకోక ముందు స్టార్ హీరోయిన్ గా సౌత్ లో రాణింంచిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడైతే అక్కినేని నాగార్జున ను పెళ్లి చేసుకుందో అప్పటినుండి భర్తే దైవం కుటుంబమే దేవాలయం అన్నట్లుగా మెదిలి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత సినిమాల్లో తల్లి పాత్రల్లో రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ తనకి సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే చెప్పుకొస్తుంది. అయితే అలాంటి అమలడైరెక్టర్ కి మొహం మీదే తలుపు వేసి అవమానించిందట. మరి ఇంతకీ అమల ఎందుకు అలా చేసింది..ఏ డైరెక్టర్ ని అవమానించింది అనేది ఇప్పుడు చూద్దాం. అక్కినేని అమల అవమానించింది ఎవరినో కాదు డైరెక్టర్ శివ నాగేశ్వరరావుని.. ఇక అసలు విషయం ఏమిటంటే..నాగార్జున, ఆమని, శరత్ బాబు లు కలిసి నటించిన మూవీ సిసింద్రీ.


ఈ సినిమాకి దర్శకుడిగా శివ నాగేశ్వరరావు వ్యవహరించారు.అలాగే ఈ సినిమా  కథ మొత్తం ఒక బాబు చుట్టే తిరుగుతుంది.ఆయనే అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్. సిసింద్రీ మూవీ మొత్తం అఖిల్ చుట్టే తిరుగుతుంది.. అయితే ఈ సినిమా కథ నాగార్జునతో తీయాలి అనుకున్న సమయంలో ఈ సినిమాలో బుడ్డోడి పాత్రలో అఖిల్ అయితేనే సెట్ అవుతాడు అని డైరెక్టర్ శివ నాగేశ్వరరావు నాగార్జునకి ఈ విషయం చెబుతామని ఇంటికి వెళ్ళాడట.అయితే నాగార్జున ఇంట్లో లేకపోవడంతో అమలకు తన కథ మొత్తం చెప్పారట. దాంతో అమల వెంటనే డైరెక్టర్ ని బయటికి వెళ్ళమని మొహం మీదే డోర్ వేసిందట.అంతేకాదు నా కొడుకుని సినిమాల్లోకి ఇంత చిన్న ఏజ్ లో తీసుకెళ్తానంటున్నావ్ నీకు ఎంత ధైర్యం ఇంకోసారి మా ఇంటికి రాకు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ మొహం మీదే తలుపు వేసిందట.

అయితే ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఇంటికి వచ్చి అమలను తిట్టి డైరెక్టర్ తో అలాగేనే మాట్లాడేది అని మందలించారట. ఇక ఆ తర్వాత అమలను కూడా అర్థం చేసుకొని ఇష్టం ఉంటే సినిమాల్లోకి పంపించాలి లేదంటే లేదు.కానీ డైరెక్టర్ని అలా అవమానించడం కరెక్ట్ కాదు అని నాగార్జున అమలతో చెప్పారట.ఆ తర్వాత అమల తప్పు తెలుసుకొని డైరెక్టర్ ని ఇంటికి పిలిచి సారీ చెప్పి తన కొడుకుని సినిమాలోకి తీసుకోవడానికి ఓకే చెప్పిందట ఇక సిసింద్రీ మూవీ లో నాగార్జునతో టబూ ఆటాడుకుందాం రా అనే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: