చాలామంది హీరోయిన్లు తాము డేటింగ్ చేసే వారితో సన్నిహితంగా ఉండే వారితో రహస్యంగా ఉంటూ ఉంటారు.వారి పర్సనల్ లైఫ్ ని మీడియా ముందు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. డేటింగ్ చేసే వ్యక్తుల గురించి అన్ని విషయాలను గోప్యంగా ఉంచాలనే అనుకుంటారు.అలా తాజాగా ఈ హీరోయిన్ కూడా తన రహస్య ప్రియుడితో రెస్టారెంట్ కి వెళ్లి అడ్డంగా బుక్ అయింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 ఏడిలో నటించిన బాలీవుడ్ బిటి దిశా పఠాని. దిశా పఠాని తెలుగులో వరుణ్ తేజ్ తో లోఫర్ మూవీ చేసింది.అలాగే పాన్ ఇండియా మూవీ అయినా కల్కి 2898ADలో కీ రోల్ పోషించింది. అయితే అలాంటి దిశా పఠాని రీసెంట్ గానే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో స్టేడియం కి వచ్చి రచ్చ రచ్చ చేసింది.

ఇంతలోనే రహస్య వ్యక్తితో రెస్టారెంట్లో కనిపించేసరికి ఆ వ్యక్తి ఎవరబ్బా అని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.అయితే దిశా పఠాని ఓ మిస్టరీ వ్యక్తితో ఉన్న రెస్టారెంట్ వీడియో బయటపడ్డప్పటికీ ఆ వ్యక్తి ఎవరో క్లియర్ కట్ గా కనిపించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో దిశా పఠాని పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో వార్తలు నెట్టింట్లో వినిపిస్తున్నాయి. అంతే కాదు సోషల్ మీడియా మొత్తం దిశా పఠానితో ఉన్న ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు అని తెలుసుకునే పనిలోనే ఉన్నారు.ఇక 2023లో ఫిట్నెస్ కోచ్ అయినటువంటి అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ ని తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ పార్టీ జరుగుతున్న సమయంలో అఫీషియల్ గా బయటపెట్టింది దిశా పటాని.

అయితే ప్రస్తుతం రెస్టారెంట్లో దిశపటాని వేరే మిస్టరీ మ్యాన్ తో ఉండడంతో దిశా పటాని అలెగ్జాండర్ కి బ్రేకప్ చెప్పి మరో వ్యక్తితో డేటింగ్ చేస్తుందా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇప్పటికే దిశా పఠాని టీవీ నటుడు అయినటువంటి పార్త్ సమతాన్, నటుడు టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేసింది. అయితే సడన్గా ఇప్పుడు వీరెవరితో కాకుండా మిస్టరీ మ్యాన్ తో కనిపించడంతో దిశా పఠాని పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: