యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ జపాన్ లో కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ జపాన్ కు వెళ్లి ప్రమోషన్స్ చేయడం ఈ సినిమాకు ఎంతో ప్లస్ అయిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. నాగచైతన్యకు షోయు అనే క్లౌడ్ కిచెన్ ఉందనే సంగతి తెలిసిందే.
 
ఈ క్లౌడ్ కిచెన్ లో జపనీస్ వంటకాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఈ క్లౌడ్ కిచెన్ లో సూషీ అనే వంటకం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నాలా ఆ వంటకం ఎవరికైతే ఇష్టమో వాళ్లకు నేను ఓ మంచి రికమెండేషన్ అందిస్తానని ఈ రెస్టారెంట్ నా స్నేహితుడు నాగచైతన్య రెస్టారెంట్ అని తారక్ కామెంట్లు చేశారు. షోయు క్లౌడ్ కిచెన్ లో ది బెస్ట్ జపనీస్ ఫుడ్ దొరుకుతుందని తారక్ పేర్కొన్నారు.
 
తారక్ వరుస విజయాలతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తుండగా తారక్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ నుంచి ప్రశాంత్ నీల్ సినిమా మొదలు కానుంది. అటు ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నీల్ సినీ కెరీర్ లలో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
 
తన సోదరుడు కళ్యాణ్ రామ్ సైతం కెరీర్ పరంగా సక్సెస్ సాధించే దిశగా ఎన్టీఆర్ ప్రణాళికలు ఉన్నాయి. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగచైతన్య, ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉండగా ఈ అనుబంధం అలాగె కొనసాగుతుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాపై ఫోకస్ పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: