ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాడ్ స్క్వేర్ మరియు రాబిన్ హుడ్ మూవీలు విడుదల అయ్యాయి. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మ్యాడ్ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో మ్యాడ్ స్క్వేర్ మూవీపై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే రాబిన్ హుడ్ మూవీ లో నితిన్ హీరో గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది.

వెంకీ కుడుముల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. గతంలో నితిన్ , వెంకీ కుడుముల కాంబినేషన్లో భీష్మ అనే మూవీ వచ్చి మంచి సక్సెస్ కావడంతో వీరి కాంబోలో రూపొందిన రెండవ సినిమా కావడంతో రాబిన్ హుడ్ మూవీ పై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ రెండు మూవీ లు కూడా ఈ సంవత్సరం ఉగాది పండగ సందర్భంగా మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యాయి. ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలలో మ్యాడ్ స్క్వేర్ మూవీ కి మంచి టాక్ రాగా ... రాబిన్ హుడ్ సినిమాకు మాత్రం అంత గొప్ప టాక్ రాలేదు. దానితో మొదటి రోజు మ్యాడ్ స్క్వేర్ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు రాగా , రాబిన్ హుడ్ మూవీ కి మాత్రం పరవాలేదు అనే స్థాయి కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా విడుదల అయినా ఈ రెండు తెలుగు సినిమాల్లో మ్యాడ్ స్క్వేర్ మూవీ మంచి విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాబిన్ హుడ్ సినిమా మాత్రం భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు కనబడడం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ రెండు సినిమాలలో ఏ మూవీ ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: