మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. గతంలో రవితేజ , శ్రీ లీల కాంబోలో రూపొందిన ధమాకా మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమాలో వీరిద్దరి జోడి కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. మరి మాస్ జాతర మూవీ లో వీరి జోడి కి ఎలాంటి ప్రశంసలు దక్కుతాయో చూడాలి. మాస్ జాతర మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్లను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ప్రమోషన్ల స్పీడును పెంచాలి అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీలోని మొదటి సాంగ్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ మూడవ వారంలో మాస్ జాతర మూవీలోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయి ఉన్నాడు. మరి మాస్ జాతర మూవీ తో రవితేజ రవితేజ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: