తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటనలో ఒకరు అయినటువంటి నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను మార్చి 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ప్రస్తుతం వరుస అపజయాల డీలా పడిపోయి ఉన్న నితిన్ ఈ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తిరిగి కం బ్యాక్ ఇస్తాడు అని చాలా మంది భావించారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు కూడా విడుదల అయిన మొదటి రోజు ప్రేక్షకుల నుండి గొప్ప టాక్ ఏమీ రాలేదు.

దానితో ఈ మూవీ కి మొదటి రోజు పెద్ద స్థాయి కలెక్షన్లు కూడా రాలేదు. మొదటి రోజు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 63 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 21 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 77 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.61 కోట్ల షేర్ ... 3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక మొదటి రోజు ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 20 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 55 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 2.36 కోట్ల షేర్ ... 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా ఏకంగా 28.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.

మూవీ క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా మరో 26.14 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. మరి ఈ సినిమా ఆ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే రాబిన్ హుడ్ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీ లీల హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: