నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో టాలీవుడ్ కి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించాడు..తన 50 సంవత్సరాల సినీ చరిత్రలో బాలయ్య ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మెప్పించాడు.. పౌరణికమైన, జానపదం అయినా, చారిత్రక నేపథ్యమైన బాలయ్య అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటారు.. బాలయ్య తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 100 వ సినిమాను చారిత్రాత్మక నేపథ్య కథతో చేసారు..చంఘీజ్‌ ఖాన్‌, గోన గన్నారెడ్డి, రామానుజాచార్య వంటి పాత్రలంటే బాలయ్య కి ఎంతో ఇంట్రెస్ట్ కానీ సరైన కథలు దొరకక అవి కార్యరూపం దాల్చలేదు..దీనితో శాత వాహనులలో గొప్ప రాజైన గౌతమి పుత్ర శాతకర్ణి కథ తో బాలయ్య తన 100వ చిత్రాన్ని చేసారు.. బాలయ్యకి ప్రయోగాలంటే ఎంతో ఇష్టం.. సినీ పరిశ్రమలో ఎవ్వరూ చేయని పాత్రని తాను చేయాలనీ ఎప్పుడూ భావిస్తారు..

త్రి సముద్రాధీశ్వరుడు అయినా గౌతమి పుత్ర శాత కర్ణి పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారు.. తెలుగు గడ్డ పై విదేశీ రాజుల ప్రభావం పడకుండా వారితో వరుస యుద్దాలు చేసి ఘన విజయం సాధించిన శాత వాహన రాజు గౌతమి పుత్ర శాత కర్ణి శాలివాహన శకం ఆరంబిస్తారు.. దీనితో యుగానికి ఆది అయిన ఆ రోజుని తెలుగు వారు ఉగాది పండుగగా జరుపుకుంటున్నారు.. తెలుగు గడ్డ పై విదేశీ రాజుల నీడ కూడా పడకుండా గౌతమి పుత్ర శాత కర్ణి రాజు తన పాలన కొనసాగించారు..

 అలాంటి గొప్ప వీరుడి పాత్రలో బాలయ్య తనదైన నటనా శైలితో అద్భుతంగా నటించారు.. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..అయితే బాలయ్య తన కెరీర్ లో ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మరిన్ని చేయాలనీ చూస్తున్నారు.. సరైన కథ దొరికితే మల్టీ స్టారర్ మూవీస్ లో సైతం నటించేందుకు బాలయ్య సిద్ధంగా వున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: