
రష్మిక తన ఫాన్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసేస్తుంది . ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్న అభిమానులతో టచ్ లో ఉంటూ ముచ్చటిస్తూ ఉంటుంది రష్మిక . ఆ కారణంగానే జనాలు ఆమెని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ఇప్పుడు ఒక స్టార్ హీరో తో సినిమాను ఓకే చేసిందట . అయితే ఈ కాంట్రవర్షియల్ హీరోతో సినిమా ఏంటి అంటూ రష్మిక ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఆ హీరో మరెవరో కాదు "సింభు".
కోలీవుడ్ ఇండస్ట్రీలో శింబు కి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 80% జనాలు హీరో శింబు లవ్ గురించి మాట్లాడితే 20% జనాలు శింబు నటన గురించి మాట్లాడుతారు. అలాంటి రొమాంటిక్ స్టేటస్ కలవాడు శింబు. నిజానికి ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నారట . కానీ ఆమె కొన్ని కారణాల చేత ఈ సినిమా ను రిజెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ సాయి పల్లవి ఖాతాలో నుంచి రష్మిక కి వచ్చిందట. దీంతో శింబు నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా వైరల్గా మారింది..!