టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో శర్వానంద్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. హీరోగా అవకాశాలను దక్కించుకున్న తర్వాత ఈయన మంచి విజయాలను అందుకుంటు తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే గత కొంత కాలంగా వరుస ఆజయలతో డిలా పడిపోయిన శర్వానంద్ ఆఖరుగా మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శర్వానంద్ చాలా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. శర్వానంద్ తాజాగా మరో దర్శకుడి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంపత్ నంది , శర్వానంద్ కు ఒక కథను వినిపించగా , అది అద్భుతంగా నచ్చడంతో సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేయడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శర్వా ... సంపత్ కాంబోలో రూపొందబోయే సినిమా 1960's  పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు ఈ సినిమా కోసం శర్వా తన లుక్ మొత్తాన్ని మార్చబోతున్నట్లు , ఇప్పటి వరకు కెరియర్లో శర్వానంద్ ఎప్పుడు కనిపించని లుక్ లో సంపత్ నంది మూవీ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శర్వానంద్ ఆఖరుగా నటించిన మనమే మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటు వంటి కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శర్వానంద్ , కృతి శెట్టి జోడీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: