
నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లే. సింహా సినిమా తో మొదలైన వీరి విజయాల ప్రస్థానం వరుస పెట్టి కొనసాగుతూ వస్తోంది. సింహా - లెజెండ్ - అఖండ సినిమా లు మూడు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. అఖండ ఇప్పటకీ బుల్లి తెరను షేక్ చేస్తూనే ఉంటుంది. అఖండ సాధించిన విజయం తర్వాత బాలయ్య కెరీర్ కు బ్రహ్మ మహా ర్దశ పట్టేసింది. ఆ సినిమా నుంచి బాలయ్య చేసిన అన్నీ సినిమా లు సూపర్ డూపర్ హిట్లే. వరుసగా అఖండ - వీరసింహా రెడ్డి - భగవంత్ కేసరి - డాకూ మహారాజ్ హిట్లు కొట్టాయి. ఇక ఇప్పుడు బాలయ్య అఖండ సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న అఖండ 2 లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ అఖండ 2 – తాండవం ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సీక్వెల్ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఓ కీలక పాత్రలో నటిస్తోందట, పైగా ఆమె రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘ ఎన్టీఆర్ బయోపిక్ ’ లో బాలయ్య సరసన విద్యాబాలన్ నటించింది. అప్పుడు ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రలో అలా ఒదిగి పోయిన విద్య .. ఇప్పుడు బాలయ్య కు జోడీగా నటిస్తోంది.
ఇక అఖండ 2 తాండవం సినిమా ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దాదాపు రు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమా పై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో బాలయ్య ఇంట్రో సీన్ అదిరిపోతుందని.. అఘోర పాత్ర పోషిస్తున్న బాలయ్య, హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ ఆయన పాత్ర రివీల్ అవుతుందని అంటున్నారు. దసరాకు ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.