కొంతమంది రాజకీయ నాయకులతో పాటు సెలబ్రెటీలకు కూడా కొన్ని రకాల సెంటిమెంట్లు ఉంటాయి.అలా వాటిని తాము చేపట్టబోయే శుభకార్యాలకు ఆ సెంటిమెంట్లను అనుసరించే ఏదైనా పని స్టార్ట్ చేస్తారు. అలా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలకు ఎన్నో రకాల సెంటిమెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ కి ఒక కొత్త సినిమా స్టార్ట్ చేయాలి అంటే తన తమ్ముడు త్రివిక్రమ రావుతో కొబ్బరికాయ కొట్టించుకుంటే గాని సినిమా స్టార్ట్ చేయకపోయే వారట. అలా త్రివిక్రమ రావు చేత కొబ్బరికాయ కొడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని సీనియర్ ఎన్టీఆర్ సెంటిమెంట్ గా నమ్మేవారట.సీనియర్ ఎన్టీఆర్ కి ఈ ఒక్క సెంటిమెంటే కాదు ఇంకా ఎన్నో సెంటిమెంట్లు ఉన్నాయి. అంతేకాదు మార్చి 29తో కూడా ఆయనకు విడదీయలేని సంబంధం ఉందట.మరి ఇంతకీ మార్చి 29కి సీనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

సీనియర్ ఎన్టీఆర్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఒక సంచలనం సృష్టించారు.ఈయన టిడిపి పార్టీ పెట్టి భారతదేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా తన టీడీపీ పార్టీని స్థాపించింది 1982మార్చి 29 రోజే. అయితే అలా మార్చి 29 రోజున సీనియర్ ఎన్టీఆర్ కి కలిసి వచ్చింది. ఇక రాజకీయాల పరంగానే కాకుండా సినిమాల పరంగా కూడా ఎన్టీఆర్ కి మార్చి 29 తో విడదీయలేని అనుబంధం ఉందట.అదేంటంటే సీనియర్ ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా ఇప్పటికీ ఒక అద్భుతమే. ఈ సినిమా మొట్టమొదటి రంగుల పౌరాణిక సినిమానట. అలా ఈ రంగుల పౌరాణిక సినిమా చూడడం కోసం అప్పట్లో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ సినిమా థియేటర్లకు వచ్చేవారట.

కవేళ సినిమా థియేటర్లో టికెట్లు అయిపోతే ఆ రోజు రాత్రి అక్కడే పడుకొని ఉదయాన్నే మళ్ళీ థియేటర్లలో లైన్లు కట్టి టికెట్ తీసుకొని సినిమా చూసే వరకు కూడా ఆ ఊరి నుండి పోకపోయేవారు. అంటే లవకుశ సినిమా అప్పటి తెలుగు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు.అయితే ఈ మొట్టమొదటి రంగుల పౌరాణిక సినిమా లవకుశ విడుదలైంది ఎప్పుడో కాదు మార్చి 29,1963.అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ నటించిన మొట్టమొదటి సాంఘిక రంగుల సినిమా దేశోద్ధారకులు. ఇక ఈ సినిమా కూడా మార్చి 29నే విడుదలైంది. ఈ మూవీ 1973 మార్చి 29న రిలీజ్ అయింది. అలా సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది 1982,29నే కావడం కూడా విశేషం. అలా తన రాజకీయ పార్టీని స్థాపించిన మార్చి 29 ఆయనకు ఎంతో ప్రత్యేకం.అంతేకాదు ఆయన నటించిన మెట్టమొదటి రెండు రంగుల సినిమాలు కూడా విడుదలైంది మార్చి 29నే కావడంతో ఈ మార్చి 29 తో సీనియర్ ఎన్టీఆర్ కి విడదీయలేని బంధం ఉందట

మరింత సమాచారం తెలుసుకోండి: