
బిగ్ బాస్ సీజన్1 మొదలైనప్పటి నుంచి బుల్లితెరపై స్టార్ మా ఛానల్ కు తిరుగులేదనే సంగతి తెలిసిందే. టాప్ 30 ప్రోగ్రామ్స్ లో స్టార్ మా, జీ తెలుగు సత్తా చాటుతుండగా ఈటీవీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడం లేదు. ఈ విషయంలో జెమిని ఛానల్ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. ఆ ఛానల్ సీరియళ్లను కానీ ప్రోగ్రామ్ లను కానీ పట్టించుకునే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి.
ఆ ఛానల్ కు పూర్వ వైభవం రావడం కోసం జూనియర్ ఎన్టీఆర్, తమన్నా కష్టపడినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. ఈటీవీ కొత్త సినిమాల హక్కులను సైతం ఎక్కువగా కొనుగోలు చేయకపోవడం ఆ ఛానల్ పాలిట శాపంగా మారిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈటీవీ ఛానల్ కు ఒకప్పుడు మంచి రేటింగ్స్ రావడానికి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి రేటింగ్స్ సాధించేవి.
అయితే ఇప్పుడు మాత్రం ఆ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిల్ అయ్యాయని చెప్పవచ్చు. ఓటీటీల హవా వల్ల బుల్లితెరకు గడ్డుకాలం మొదలైనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ని ప్రముఖ ఛానెళ్లకు సొంతంగా ఓటీటీలు సైతం ఉన్నాయి. అయితే అవి ప్రముఖ ఓటీటీలైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇచ్చే విషయంలో ఫెయిల్ అయ్యాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.