
రొటీన్ రొట్ట కమర్షియల్ హీరోయిన్ తరహ పాత్రలకు గుడ్ బాయ్ చెప్పేసింది రష్మిక .. రాబిన్ హుడ్ అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ . ఈ సినిమా లో మొదట రష్మిక నే హీరోయిన్ గా అనుకున్నారు .. అంతకుముందు నితిన్ , వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ హిట్ .. ముందు అదే కాన్ఫిడెన్స్ తో సినిమా ఓకే చేసినప్పుడు ఉంది. అయితే సినిమా తెరకెక్కిస్తున్న తీరు తనకి ఎక్కడో తేడా కొట్టింది ముఖ్యంగా తన క్యారెక్టర్ లో సరైన బలం లేదని విషయం రష్మిక ఎంతో తెలివిగా తెలుసుకుంది .. తనకు డేట్స్ అడ్జస్ట్ కావటం లేదు అనే సాకు చూపి చక్కగా పక్కకు వెళ్లిపోయింది .. పుష్ప సినిమా నిర్మాతలు కావడం తో వాళ్లు కూడా సైలెంట్ గా వేరే ఆప్షన్ గా మరో హీరోయిన్ చూసుకున్నారు ..
అలా రష్మిక తప్పుకున్న తర్వాత శ్రీలీల ఈ సినిమాలోకి వచ్చింది .. ఇక్కడే శ్రీలీల క్యారెక్టర్ల ఎంపిక పై మరోసారి విమర్శలు అనుమానాలు వస్తున్నాయి .. అసలు పర్ఫామెన్స్ కి స్కోప్ లేని ఇలాంటి క్యారెక్టర్లు ఇప్పటికే ఈమె చాలా చేసి అపజయాలు అందుకుంది శ్రీలీలా .. ఇక శ్రీలీల ఒక క్యారెక్టర్ ఓకే చెప్పిందంటే ఆ కథ చాలా వీక్ గా ఉంటుందని ముద్ర ఇప్పటికే ఇండస్ట్రీలో ఉంది .. ఈ సెంటిమెంట్ ఇప్పుడు రాబిన్ హూడ్ తో కూడా మరింత బలపరిచింది .. ఇన్నేళ్ల తన సిని కెరియర్ లో హీరోయిన్గా ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సినిమా ఆమె కెరియర్ లో లేదు .. ఇప్పటికైనా శ్రీలీల సీరియస్ గా ఆలోచించుకోవాలి . ఇకనుంచైనా తన క్యారెక్టర్ల ఎంపిక లో ఎంతో తెలివిగా ప్లానింగ్ గా ముందుకు వెళ్లాలి లేకపోతే భవిష్యత్తు కష్టం .