నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం లెజెండ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. రాధిక ఆప్టే , సోనాల్ చౌహాన్మూవీ లో హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2014 వ సంవత్సరం మార్చి 28 వ తేదీన విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి ఈ సంవత్సరం మార్చి 28 వ తేదీతో 11 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఎన్ని కలెక్షన్లను వసూలు చేసి , ఏ రేంజ్ విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకొందాం.

మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 9.41 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 8.40 కోట్లు , ఉత్తరాంధ్ర లో 3.68 కోట్లు , ఈస్ట్ లో 2.25 కోట్లు , వెస్ట్ లో 2.21 కోట్లు , గుంటూరు లో 4.14 కోట్లు , కృష్ణ లో 2.30 కోట్లు , నెల్లూరు లో 1.70 కోట్లు , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 34.09 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా లో 4.75 కోట్లు , ఓవర్సీస్ లో 1.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 43.39 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 32 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 40.39 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ ద్వారా బయ్యర్లకు 8.09 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని ఆ సమయంలో సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: