
భైరవం సినిమాకు ఫిబ్రవరిలో రిలీజ్ డేట్ ఇచ్చారు . కానీ సినిమా రాలేదు ఎప్పుడు వస్తుందో .. ఇప్పటివరకు ప్రకటించలేదు .. దానికి కారణం ఓటీటీ అమ్మకాలు .. ఇక చిరంజీవి విశ్వంభర పరిస్థితి కూడా ఇంతే .. ఇప్పటివరకు ఓటీటీ అమ్మకం జరగలేదు .. అందుకే ఒకసారి వేసిన డేట్ ను మార్చేశారు తర్వాత డేట్ వేయటమే మానేశారు . మంచు విష్ణు డ్రిం ప్రాజెక్ట్ కన్నప్ప కూడా ఏప్రిల్ మూడో వారం లో వస్తుందని అనుకున్నారు .. కానీ ఇప్పుడు అది కూడా రావటం లేదు .. వి ఎఫెక్ట్స్ వర్క్ పెండింగ్ అంటున్నారు .. కానీ ఓటిటి అమ్మకాలు కూడా ఓ కారణమని కూడా మరో వార్త తెలుస్తుంది .
సారంగపాణి జాతకం .. ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది .. ఓటిటి అమ్మకాల్లో అగ్రిమెంట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు అది ఓకే అయితే ఈ నెలలో రిలీజ్ కాబోతుంది .. అంతేకాకుండా మరో మూడు నాలుగు సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది . ఓటీటీ గీత దాటలేవు అలా అని థియేటర్లకు తెగించి తీసుకురాలేవు .. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి ఇదొక ప్రధాన కారణం .