నాచురల్ స్టార్ నాని తాజా గా నటిస్తున్న మూవీ హిట్ 3 .. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై సాలిడ్ బ‌జ్ క్రియేట్ అయింది .. దర్శ‌కుడు శైలాష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఇక‌ ఈ సినిమా లో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు .. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తన తర్వాత సినిమా ని ఇప్పటికే ప్రకటించేసాడు ఈ నేచురల్ స్టార్ ..
 

దసరా వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా ని చేస్తున్నాడు .. అలాగే ఈ సినిమా కు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా దానికి సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు టాలీవుడ్ మీడియా లో గట్టిగా వినిపిస్తుంది .  అయితే ఈ సినిమా లో  నాని కి జంట గా స్టార్ హీరోయిన్ కృతి శెట్టి నటించబోతుంద ని టాక్ జోరుగా వినిపిస్తుంది .. ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కు ఆమె అయితేనే బాగా సూట్ అవుతుంద ని చిత్ర యూనిట్ భావిస్తుందట .

 

ఇక గతం లో నాని కి జంటగా కృత్తి శెట్టి ‘శ్యామ్ సింఘ రాయ్’ లో నటించింది .. ఇక ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాలో కృతి నటిస్తే ఇది నాని తో రెండో సినిమా అవుతుంది ..  ఇక గత కొంత కాలంగా కృతి శెట్టి సరైన హిట్ కోసం ఎదురు చూస్తుంది .. నాని అయినా కృతి కి అలాంటి హిట్ ఇస్తాడా లేదో చూడాలి .. ఇక దీ  పారడైజ్ సినిమా ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండ గా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు .  ఈ సినిమాను  2026 మార్చ్ 26న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: