తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటుల లో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. సిద్దు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రూపొందుతున్న జాక్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది . ఈ సినిమాలో ఏప్రిల్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా మొదలు పెట్టారు.

అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం వారు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన యు ఎస్ ఎ బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్లు అలాగే ఈ సినిమాకు సంబంధించిన యు ఎస్ ఏ ప్రీమియర్స్ ను ఏప్రిల్ 9 వ తేదీనే ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఇకపోతే సిద్దు పరచగా డిజె టిల్లు , టిల్లు స్క్వేర్ మూవీలలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. అలా వరుస విజయాల తర్వాత సిద్దు నటిస్తున్న సినిమా కావడంతో జాక్ మూవీ పై ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj