నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. గతంలో నాని హీరో గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. అలా ఇప్పటికే వీరి కాంబోలో రూపొందిన దసరా మూవీ మంచి విజయం సాధించడంతో ది ప్యారడైజ్ మూవీ అనౌన్స్ కావడం తోనే ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

ఇది ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఒక్క సారిగా ది ప్యారడైజ్ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ది ప్యారడైజ్ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులే అవుతున్న ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ను మాత్రం మేకర్స్ కాన్ఫర్మ్ చేయలేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటించబోయే హీరోయిన్ ని కాన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి కృతి శెట్టి ని ది ప్యారడైజ్ మూవీ లో హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో మేకర్స్ ప్రకటించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గతంలో నాని హీరోగా రూపొందిన శ్యామ్ సింగరాయ్ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: