గతంలో ఒకప్పుడు వరుసగా ప్లాప్‌ల్లో ఉన్నాడు .. అయినా సినిమాలు చేశాడు హిట్‌ కోసం ఎదురు చూశాడు అలా మొత్తానికి వాంటెడ్ సినిమా తో మంచి క‌మ్ బ్యాక్‌ ఇచ్చాడు .. అయితే ఈసారి బాలీవుడ్ స్టార్ సల్మాన్ కు అంత సమయం లేదు .. ప్రస్తుతం ఈ హీరో వయసు 59 సంవత్సరాలు .. ఈ సంవత్సరం గడిస్తే షష్టిపూర్తి .. ఇలాంటి సమయం లో వరస ప్లాప్ లు వస్తే వెయిట్ చేయడానికి సల్మాన్ దగ్గర సమయం లేదు కాబట్టి సికిందర్ సినిమా కచ్చితంగా విజయం సాధించాల్సిందే ..

ఇక సల్మాన్ కు నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .. ఇదే టైంలో కొత్త తరం ప్రేక్షకులు కూడా గట్టిగా వస్తున్నారు .. ఇప్పటికీ తన వయసులో సగం కూడా లేని హీరోయిన్లతో డ్యాన్సు లు చేస్తుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు .. సోషల్ మీడియా లో ఓపెన్ గానే సల్మాన్ పై విమర్శలు చేస్తున్నారు .  ఇదే క్రమంలో సౌత్ హీరోలకు వయసు తో సంబంధం లేదు .. ఎంత వయసు వచ్చిన వాళ్ళు హీరోలే .. అందుకే రజనీకాంత్ , కమలహాసన్ , చిరంజీవి , బాలకృష్ణ లాంటి చాలా మంది ఇంకా హీరోలు గా సినిమాలు చేస్తున్నారు ..

నార్త్ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు .  ఎంతోమంది స్టార్లు ప్లాప్‌లు వచ్చి వయసు మళ్లిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు . సల్మాన్ ఖాన్ కూడా దీనికి మినహాయింపు కాదని కూడా అంటున్నారు . పైగా గతంతో పోలిస్తే ఇప్పుడు బాలీవుడ్ లో మరింత గడ్డు పరిస్థితులు ఉన్నాయి .. ఇలాంటి సమయంలో ఎలా చూసుకున్నా సల్మాన్ కేరీర్ కు ఎలాంటి వెయిటింగ్‌ పీరియడ్ లేదు .. ఉన్న సమయంలో చక చక సినిమాలు చేయాలి అదే టైంలో ఎక్కువ ప్లాప్ లు రాకుండా జాగ్రత్తగా ఉండాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: