నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరియర్లో ఎంతో మంది డైరెక్టర్లను రిపీట్ చేశాడు. బాలకృష్ణ ఒక దర్శకుడితో ఏకంగా 5 సినిమాలు చేస్తే అందులో రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , మరో రెండు సినిమాలు ఏకంగా ఇంట్రెస్ట్ నిలిచాయి. ఒకే ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది. అంతలా బాలకృష్ణకు కలిసి వచ్చిన ఆ దర్శకుడు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణకు అద్భుతంగా కలిసి వచ్చిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. బాలకృష్ణ , బి గోపాల్ కాంబినేషన్లో మొదటగా లారీ డ్రైవర్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కూడా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ వీరి కాంబోలో మూవీ కి కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సమర సింహా రెడ్డి అనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ వచ్చింది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో నరసింహ నాయుడు అనే సినిమా వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక వీరి కాంబినేషన్లో ఐదవ మూవీ గా పలనాటి బ్రహ్మనాయుడు అనే మూవీ వచ్చింది. ఈ సినిమా అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. అలా వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు వస్తే అందులో రెండు బ్లాక్ బాస్టర్ మూవీలుగాను , రెండు ఇండస్ట్రీ హిట్ లుగా నిలవగా , ఒక సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: